Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

Advertiesment
Black Magic

సెల్వి

, శనివారం, 26 జులై 2025 (19:40 IST)
Black Magic
ఎంతగా టెక్నాలజీ పెరిగినా... కొందరు మూర్ఖులు మూఢ నమ్మకాలు వీడట్లేదు. ఈ క్రమంలో దొంగబాబాలను నమ్మి నరబలి ఇస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా సొంత మేనల్లుడినే నరబలి ఇచ్చాడు. సూదులతో రక్తం తీసి మాంత్రికుడికి అప్పజెప్పాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సారాయ్‌ కలాన్‌ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు లోకేష్ ఈ నెల అంటే జూలై 19వ తేదీన అదృశ్యమయ్యాడు. పోలీసులు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో పాడుబడ్డ ఇంట్లో బాలుడు లోకేష్ డెడ్ బాడీ దొరికింది. ఆ బాలుడి శరీరం నిండా సూదులు గుచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ దర్యాప్తులో మృతుడు లోకేష్ మేనమామ మనోజ్ కుమార్‌‌పై పోలీసులకు అనుమానం కలిగింది. అతనిని విచారించడం అసలు విషయం బయటపడింది. మనోజ్ భార్య అతనితో గొడవపడి.. పుట్టింటికి వెళ్లింది. ఆమెను ఇంటికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మాంత్రికుడి మాటలు నమ్మి మేనల్లుడిని నరబలి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. 
 
దీంతో జూలై 19న చాక్లెట్ ఇస్తానని ఆశచూపి.. బాలుడు లోకేష్‌ను పాడు బడ్డ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ లోకేష్ గొంతునులిమి హత్య చేశాడు. ఆపై సిరంజీలతో రక్తం తీసి మాంత్రికుడికి అందించాడని ఒప్పుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2028 ఆర్థిక సంవత్సరం నాటికి 1,15,836 స్థాయికి చేరుకోనున్న భారత సెన్సెక్స్ సూచీ: వెంచురా