Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Advertiesment
lovers

ఠాగూర్

, బుధవారం, 23 జులై 2025 (08:34 IST)
నువ్వు.. నీవు ఇష్టపడిన ప్రియుడు సుఖంగా జీవించండి.. మీ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ తన భార్యను ఆమె ప్రియుడుతో ఓ భర్త సాగనంపాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామంలో జరిగింది. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన చెందిన రామ్ చరణ్ (47)కు జానకీదేవి(40)తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రామ్ చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకి ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. నాలుగేళ్ల క్రితం జానకికి సమీప గ్రామంలో ఉండే దినసరి కూలీ సోను ప్రజాపతి(24)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏడు నెలలు వారిద్దరూ ఒకే ఇంట్లోనే కలిసి జీవించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న రామ్ చరమ్ భార్యని నిలదీయగా క్షమాపణ చెప్పి, కొంతకాలం భర్తతో కలిసి ఉంది. కొన్ని నెలల తర్వాత జానకి మళ్లీ తన ప్రియుడి దగ్గరికే వెళ్లింది. దీంతో జానకి కనిపించడం లేదని భవానీగంజ్ ఠాణాలో ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నెల 20న ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు. 
 
తన భార్య ప్రియుడు సోనుతో ఉండటం ఇష్టమేనని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని ఠాణాలో సమర్పించాడు. 'గతంలో ఇలాగే చేసి తిరిగి వస్తే క్షమించాను. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తుందని భయంగా ఉంది. తనతో నేను కలిసి ఉండలేను' అని రామ్ చరణ్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!