గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కానిస్టేబుల్ అయిన తన ప్రియురాలిని హత్య చేసిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేరుగా ఆమె పనిచేసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కచ్ జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దిలీప్ డాంగ్చియాకు 2021లో అదే ప్రాంతానికి చెందిన అరుణా బెన్ నతుభాయ్ జాదవ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. అరుణాబెన్ అంజార్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తుంగా, దిలీప్ ప్రస్తుతం మణిపూర్‌లో విధులు నిర్వహిస్తాడు.
కొంతకాలంగా మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు పేర్కొన్నారు. శుక్రవారం కూడా ఇరువుర మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దిలీప్ ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. శనివారం ఉదయం ఆమె విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. తన తల్లిని అరుణా బెన్ తీవ్రంగా దూషించడం తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెను హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు వెల్లడించారు.