కార్తీక సోమావతి అమావాస్య.. 108సార్లు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే..?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (19:14 IST)
కార్తీక సోమావతి అమావాస్య.. సోమవారం డిసెంబర్ 14, 2020న వస్తోంది. ఈ రోజున అమావాస్య పూజ ఇంట ముగించి.. శివాలయాన్ని సందర్శించాలి. అలాగే శివాలయంలో వుండే.. రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సోమవారం వచ్చే ఈ అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అదీ కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది. 
somati amavasya
 
సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్యను మౌని అమావాస్య, శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం

తర్వాతి కథనం
Show comments