Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం (09-03-18) దినఫలాలు ... శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా...

మేషం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (08:50 IST)
మేషం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న పదోన్నతి, బదిలీ యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు.
 
వృషభం : స్త్రీలకు గృహంలో ఒక శుభకార్యం చేయాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
 
మిథునం : మీ వృత్తికి సంబంధించి అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలుగుతుంది. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని పరిస్థితులు ఆనందం కలిగిస్తాయి. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం : పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దక్కించుకుంటారు. సోదరులతో ఏకీభవించలేక పోతారు. శ్రమ కొంతమేరకు ఫలిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాట పడవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహరుస్తుంది.
 
సింహం : అనుకున్న పనులు పూర్తికాకపోవడంతో ఒకింత అసహనానికి గురవుతారు. ఆపరేషన్లు చేయుసమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య : ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. దైవారాధన పట్ల ఆసక్తి నెలకొంటుంది. బాగా శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తికావు. విద్యార్థుల్లో భయం తొలగి మానసిక ధైర్యం నెలకొంటుంది. శ్రమాధిక్యత, అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల : సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పని చేసి అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. చివరి క్షణంలో చేతిలో ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి.
 
వృశ్చికం : పన్నులు, వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.
 
ధనస్సు : ఆస్తులను వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మకరం : దుబారా నివారించాలన్న మీ యత్నం నెరవేరదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి.
 
కుంభం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ సంతానం ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం.
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతంగా భావించకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments