Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం దినఫలాలు - అందరికీ సహాయం చేసి...

మేషం : శతృవులపై విజయం సాధిస్తారు. రాజకీయాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యల పట్ల ఆహంకారం వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తవచ్చ

Advertiesment
daily horoscope
, సోమవారం, 5 మార్చి 2018 (08:28 IST)
మేషం : శతృవులపై విజయం సాధిస్తారు. రాజకీయాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యల పట్ల ఆహంకారం వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు.
 
వృషభం : కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. ఇతరుల ఆనందం, తెలివి మిమ్మల్ని ఆకర్షిస్తాయి. బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమని ఎదుర్కొంటారు. మీ అతిధి మర్యాదలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మిథునం : వదిలేసుకున్న బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రుణాలు తీరుస్తారు.
 
కర్కాటకం : విద్యార్థులకు జ్ఞాపకశక్తి కొంత మందగించడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలో వారికి సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు.
 
సింహం : దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. కేటరింగ్ రంగాల్లో వారికి పనివారల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. వివేకంతో వ్యవహరించడం వల్ల మీ పాత సమస్యలు ఒక కొలిక్కి తెస్తారు.
 
కన్య : భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత, మెళుకువ వహిస్తారు. వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుటమంచిది.
 
తుల : కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఆడిట్. అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ధిపొందటానికి యత్నిస్తారు జాగ్రత్త వహించండి. స్త్రీలు ఆలయాలను సందర్శించుకుంటారు.
 
వృశ్చికం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. పాత మొండిబాకీలు వసూలవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి.
 
ధనస్సు : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, త్రిప్పుట తప్పవు. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. నిశ్చింతగా ఉండండి మీ సమస్యలు ఇబ్బందులు అవే సర్దుకుంటాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు ఆహార విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మకరం : అందరికీ సహాయం చేసి మాటపడతారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఇంటర్య్వూలలో జయం పొందుతారు.
 
కుంభం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్టాక్‌నిల్వలలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మీనం : ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. బ్యాంకు పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం (04-03-18) దినఫలాలు : దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు...