Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం మీ రాశిఫలితాలు ... విందుల్లో పరిమితి మంచిది

మేషం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ

Advertiesment
daily horoscope
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:02 IST)
మేషం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాలవారికి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృషభం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అంతంగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులను కలుసుకుంటారు. అధ్యాపకులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. 
 
మిథునం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
కర్కాటకం: మీ శ్రీమతిని నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పువు. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసివస్తుంది. 
 
సింహం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కన్య: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. విందుల్లో పరిమితి పాటించండి. విద్యార్థులకు కొన్ని నిర్భంధాలకు లోనవుతారు.
 
వృశ్చికం: వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. కొంతమంది మీతో స్నేహంగా నటిస్తూనే మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు : కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తలుతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
మకరం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రేమికుల మధ్య ఇతరుల వల్ల విభేదాలు తలెతుత్తాయి. ఉపాధ్యాయ రంగాల్లో వారికి అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 
 
కుంభం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బందుమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శిచడం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోళీ రంగుల్లో ఆ నాలుగు వేటిని సూచిస్తాయో... తెలుసా?