Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ దినఫలాలు (మంగళవారం 27-02-18) ... మిత్రులపై ఉంచిన మీ నమ్మకం...

మేషం : నిరుద్యోగులు ఏ చిన్న అవకాసం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకోకండి. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంట

Advertiesment
మీ దినఫలాలు (మంగళవారం 27-02-18) ... మిత్రులపై ఉంచిన మీ నమ్మకం...
, మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (07:32 IST)
మేషం : నిరుద్యోగులు ఏ చిన్న అవకాసం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకోకండి. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు అనాలోచిత నిర్ణయాలవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి పెరుగుతుంది.
 
వృషభం : దైవ, సేవా సంబంధిత కార్యక్రమాలపై దృష్టి పెడతారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపార రంగంలోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉమ్మడి కార్యక్రమాలు, సమావేశాలు, యూనియన్ వ్యవహారాలు సఫలం అవుతాయి.
 
మిథునం : కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలసివచ్చే కాలం. మొండిబాకీలు సైతం వసూలు అవుతాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పవు. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యతవల్ల మనస్సు నిలకడగా ఉండదు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులు అవుతారు. బంధువుల రాకతో అసౌకర్యానికి లోనవుతారు. బంధువర్గాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి.
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలం. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసి రాగలదు. ఉమ్మడి వ్యాపారాలు విడనాడి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలాచన స్ఫురిస్తుంది.
 
కన్య : ఉద్యోగస్తులు సహోద్యోగులతో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మార్పులు అనుకూలిస్తాయి. గృహానికి సంబంధించిన వస్తువులు అమర్చుకుంటారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొనటంవల్ల అనుకున్నంత సంతృప్తి కానరాదు. మిత్రులను కలుసుకుంటారు.
 
తుల : స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. గృహోపకరణాల వ్యాపారులకు కలసి రాగలదు. దంపతుల మధ్య అవగాహనా లోపం లాంటివి తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కావని గ్రహించండి. రాజకీయాలలోని వారికి కార్యకర్తలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. సంఘంలో మీకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు : కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు పనివారలవల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. చేపట్టిన  పనిలో కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. బంధువుల రాకవల్ల ఊహించని ఖర్చులు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు తలెత్తే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.
 
మకరం : ఓర్పుతో వ్యవహరించటంవల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కుంభం : వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. కొబ్బరి, పండ్లు, పువ్వులు, చిరు వ్యాపారస్తులకు సామాన్యం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు.
 
మీనం : శ్రీవారు, శ్రీమతి మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు అధికంగా శ్రమించటంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం మంచిది. రుణ విముక్తులు కావటంతోపాటు మానసికంగా కుదుటపడతారు. ధన వ్యయం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలి?