Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం మీ దినఫలాలు (26-02-18) : దోష నివారణ వల్ల...

మేషం : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. తాకట్టుపై రుణాలు స్వీకరిస్తారు. గృహ వాస్తు ద

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (08:36 IST)
మేషం : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. తాకట్టుపై రుణాలు స్వీకరిస్తారు. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. 
 
వృషభం : ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేక పోతారు. సంఘంలో మీ స్థాయి పెరుగును. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. తరచూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. 
 
కర్కాటకం : విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
సింహం : వస్త్ర, ఫ్యాన్సీ నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్లుతుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు తీరుతాయి. 
 
కన్య : ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాలలో ఫ్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
తుల : ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. పెద్దల ఆహారవ్యవహారాల్లో మెళకువ వహించండి. ఏ విషయానికీ కలిసిరాని సోదరీసోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
వృశ్చికం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదువు సాధ్యం కాదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
ధనస్సు : స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలినివ్వవు. స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కొనక తప్పదు. పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మకరం : ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్తులకు అనుకూలం. మీ యత్నాలకు చక్కని అవకాశం. ప్రముఖుల సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది.. జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలు షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. బంధుమిత్రులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మీనం : సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం (25-02-2018) మీ రాశి ఫలితాలు..