Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు (03-03-18) దినఫలాలు...

మేషం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకోగలుగుతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి

Advertiesment
ఈ రోజు (03-03-18) దినఫలాలు...
, శనివారం, 3 మార్చి 2018 (08:37 IST)
మేషం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకోగలుగుతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి కాగలవు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునప్పుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
వృషభం : ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికంగా వుంటాయి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
మిథునం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయం సాధించగలరు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. మెలకువ వహించండి. నూతన వ్యక్తులతో పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. 
 
కర్కాటకం : విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం వుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. స్త్రీలకు విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలిస్తాయి. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. 
 
సింహం: వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. సత్కాలం రాబోతోంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. స్థిరాస్తి క్రయ లేక విక్రయ దిశగా మీ ఆలోచనలుంటాయి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. హామీలు, చెక్కుల జారీలో ఆలోచన మంచిది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. 
 
కన్య: విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ వాహనం పిల్లలకు ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖర్చులు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. 
 
తుల : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి, పురోభివృద్ధి. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం.
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. స్వయంకృషితో అభివృద్ధి చెందుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఇతరులతో సంబంధం లేకుండా మీ పనిలో మీరు నిమగ్నులవుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
ధనస్సు: ఒక అవకాశం చేజారిపోవడంతో నిరుత్సాహం చెందుతారు. మీకు దగ్గరగా వున్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం వుంటుంది. వ్యాపారాలు, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొనవలసివస్తుంది.
 
మకరం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. 
 
కుంభం: పాత, కొత్త ఆలోచనల మధ్య సతమతమౌతూ నలిగిపోతుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో కొత్త ఆశలను కలిగిస్తాయి. కుటుంబీకులతో కలహాలు, మాట పట్టింపులు తలెత్తే సూచనలున్నాయి. మీలోని సృజనాత్మకత సన్నగిల్లిపోతోందని గ్రహించండి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మీనం: అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవమర్యాదలు తగ్గుతాయి. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలనీలాల వేలం పాట.. శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం