Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం (02-03-18) మీ దినఫలాలు - ఏమాత్రం పొదుపు...

మేషం: కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. అధికారులు ధన

Advertiesment
శుక్రవారం (02-03-18) మీ దినఫలాలు - ఏమాత్రం పొదుపు...
, శుక్రవారం, 2 మార్చి 2018 (08:06 IST)
మేషం: కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. 
 
వృషభం: కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. గతంలో మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు శ్రమ అధికం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మిథునం: స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులపై తోటివారి ప్రభావం అధికంగా ఉంటుంది. అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: భాగస్వామిక సమావేశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
సింహం: రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. మీ పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి.
 
కన్య: ఒక కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ కళారంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా వుంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విదేశాలు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. 
 
తుల: ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. విద్యార్థుల్లో లక్ష్యం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. ఏకాగ్రత లోపం, చంచలత్వం వల్ల విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం: మీ ఉన్నతిని చాటుకునేందుకు ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
ధనస్సు: కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. మీ పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
మకరం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి లాభదాయకం. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముందుగా ఊహించిన ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు.
 
కుంభం: ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మీనం: కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలసిరాగలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బాధలకు అత్త, భర్త కారణమంటే? ఎలా..?