Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం మీ దినఫలాలు : వృత్తి ఉద్యోగ బాధ్యతలను...

మేషం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులు రాకపోకలు అధికమవుతాయి. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. ఓర్పు, రాజీ ధోరణితోనే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతులకు ఒక్క క్షణం కూడా సఖ్యత ఉం

Advertiesment
బుధవారం మీ దినఫలాలు : వృత్తి ఉద్యోగ బాధ్యతలను...
, బుధవారం, 7 మార్చి 2018 (08:51 IST)
మేషం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులు రాకపోకలు అధికమవుతాయి. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. ఓర్పు, రాజీ ధోరణితోనే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతులకు ఒక్క క్షణం కూడా సఖ్యత ఉండదు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
వృషభం : ఉద్యోగస్తులు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన యత్నాలు గుట్టుగా సాగించాలి. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. సన్నిహితులు ఆసపత్సమయంలో ఆదుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల మోపపోయే ఆస్కారం ఉంది.
 
మిథునం : నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
కర్కాటకం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యమైన ఆశించిన ప్రయోజనాలుండవు. ఏ సమస్యైనా నిబ్బరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం : రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల, ప్రయాణాలలో మెళకువ అవసరం. విద్యార్థుల ఆశయ సిద్ధికి ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదుర్కొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కన్య : ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి, పదోన్నతి, స్థానచలనం వంటి మార్పులు సంభవం. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. నూతన టెండర్ల ఆశించినంత సంతృప్తినీయజాలవు. సంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వాయిదాపడిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
తుల : సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. విద్యా రంగాల్లో వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ వ్యాపారులకు లాభదాయకం. పొదువు ఆవశ్యకతను గుర్తిస్తారు. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు తప్పవు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధికమిస్తారు.
 
మకరం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం ఉత్తమం.
 
కుంభం : వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మితిమీరిన శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సాహస యత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి.
 
మీనం : ఆదాయ వ్యయాలాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమంకాదు. ప్రైవేటు సంస్థల్లో వారు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటో తెలుసా...?