Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం (31-05-2019) మీ రాశిఫలాలు - శత్రువుల మధ్య కలహాలు...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (05:30 IST)
మేషం : విద్యార్ధులకు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కోర్టు పనులు వాయిదా పడి నిరుత్సాహం కలిగిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. వృత్తి, ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం : కళ, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కేటరింగ్ రంగాల్లో వారికి పనివారల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాలో వారికి సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
మిథునం : వివేకంతో వ్యవహరించడం వల్ల మీ పాతసమస్యలు ఒక కొలిక్కి తెస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారికి పనిభారం అధికం అవుతుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతారు. ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం : ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. విపరీతమైన ఖర్చులు, ధనం నిల్వచేయకపోవటం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. బంధువులను కలుసుకుంటారు.
 
సింహం : శత్రువుల మధ్య కలహాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుటమంచిది. పట్టుదలతో అనుకున్నది సాధించి విమర్శకులకు ధీటుగా నిలుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి కొంత మందగించడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు.
 
కన్య : మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్యాయం చూసుకోవటం ఉత్తమం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు విషయంలో పునరాలోచన అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఖర్చులు అధికమవుతాయి.
 
తుల : మీ సంతానం అత్యుత్యాహాన్ని అదుపులో ఉంచటం క్షేమదాయకం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత, మెళుకువ వహిస్తారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒక స్ధిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మెళుకువ చాలా అవసరం. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు : తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. ప్రైవేటు సంస్ధలల్లో స్థిరచిత్తంతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
మకరం : కోర్టు, స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. పాత మొండిబాకీలు వసూలవుతాయి.
 
కుంభం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. వైద్యులకు ఏకాగ్రతచాలా అవసరం. బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళుకువ వహించండి.
 
మీనం : వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు చికాకులు తప్పవు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మాటతీరు, ప్రవర్తనలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments