Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం (30-05-2019) మీ రాశిఫలాలు - మీలో ఆత్మ విశ్వాసం...

Advertiesment
గురువారం (30-05-2019) మీ రాశిఫలాలు - మీలో ఆత్మ విశ్వాసం...
, గురువారం, 30 మే 2019 (06:00 IST)
మేషం : నూతన వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
 
వృషభం : పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్టాక్‌నిల్వలలో మెళుకువ అవసరం. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయం కొంత ఆలస్యంగానైనా సత్ఫలితాలనిస్తుంది. ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు చికాకులుతప్పవు.
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్ధులకు ప్రోత్సాహకర సమయం. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. ఫీజులు చెలిస్తారు.
 
కర్కాటకం : వస్త్ర, గృహోపకరణాలు, బంగారు, వాహనాల వ్యాపారులకు లాభదాయకం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు.
 
సింహం : కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. పారితోషికాలు అందుకుంటారు. ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. బంధువులను కలుసుకుంటారు.
 
కన్య : రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల సమర్థతవల్ల అధికారులు, సహోద్యోగులు లబ్ధిపొందుతారు.
 
తుల : బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆర్ధిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అసాధ్యమనుకున్న వ్యవహారం సునాయాసంగా సానుకూలమవుతుంది. ఆత్మీయుల కోసం ధనం విరివగా వ్యయం చేస్తారు.
 
వృశ్చికం : స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సహకార సంస్థలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
ధనస్సు : అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. నిశ్చింతగా ఉండండి మీ సమస్యలు ఇబ్బందులు అనే సర్దుకుంటారు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మకరం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పురోభివృద్ధి. పాత సమస్యల నుండి బయటపడతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కుంభం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు రాబడికి మించటంతో చేబదుళ్ళు స్వీకరిస్తారు. నూతన దంపతులు ఒకరికొకరు మరింత చేరువవుతారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం : అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దరిద్ర దేవత ఎక్కడ నివసిస్తుందో తెలుసా? శనివారం రావిచెట్టు?