Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ఆదివారం (26-05-2019) దినఫలాలు ... రాజకీయ నేతలకు...

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 26 మే 2019 (08:20 IST)
మేషం : మత్య్స కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన వస్తువువు వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదు. మిత్రులను కలుసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నులౌతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది.
 
వృషభం: విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం వుండదు. గృహంలో శుభకార్యానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. నూత ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం: శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. రాజకీయాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. రిప్రజెంటేటివ్‌లకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు.
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వుంటాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు.
 
సింహం: దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురౌతారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కన్య: ఫ్యాన్సీ కిరాణా సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. స్త్రీలకు విలువైన వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడుల విషయంలో పునారాలోచన అవసరం. బంధుమిత్రులను కలుసుకుంటారు.
 
తుల: భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
వృశ్చికం : ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. నిరుద్యోగులు సదవకాశాలు సద్వినియోగం చేసుకోవటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం.
 
ధనస్సు: సినిమా, కళారంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. దైవదర్శనాలు చేస్తారు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
 
మకరం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం: కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి.
 
మీనం: స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎంతటి వారినైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-05-2019 నుంచి 01-06-2019 వరకు వార రాశిఫలాలు