Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-07-2019- సోమవారం మీ రాశి ఫలితాలు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (10:41 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి. ఉమ్మడి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. దైవదర్శనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. కార్యసాధనలో అనుకూలత. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
వృషభం: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ప్లీడర్లకు ప్లీడరు గుమాస్తాలకు క్లయింట్స్‌తో చికాకులు తప్పవు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందిస్తాయి. బంధు, మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. 
 
మిధునం: ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయటం మంచిది కాదు. ముఖ్యమైన విషయాలను మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. తొందరపాటు చర్యల వల్ల నష్టాలు, ఇబ్బందులెదుర్కుంటారు. 
 
కర్కాటకం: స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహారాల్లో మెళకువ వహించండి. వృత్తుల వారికి పేరు ప్రఖ్యాతులు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
సింహం: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక వ్యవహారాల పట్ల దృష్టి సారిస్తారు. బ్యాంకు పనుల్లో ఒత్తడి, జాప్యం ఎదుర్కుంటారు. ఆస్తి పంపకాలు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
కన్య: విదేశాల్లోని ఆత్మీయులకు ప్రయమైన వస్తుసామగ్రి అందిస్తారు. ఇతరులతో సంభాషించేటపుడు ముందు వెనుకలు చూసుకోవటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. మీ యత్నాలు ఫలించటంతో పాటు కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీలకు టీ. వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, ధనప్రాప్తి, వస్తులాభం వంటి ఫలితాలున్నాయి.
 
తుల: విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. పత్రికా సంస్ధలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది.
 
వృశ్చికం: ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థినులు మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన చోదకులకు ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సూటిగా వ్యక్తం చేయండి. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది.
 
ధనస్సు: ధనవ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విత్తనాల కొనుగోళ్ళు, వ్యవసాయ కూలీలతో చికాకులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
 
మకరం: ఆర్థక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, కొత్త సమస్యలు ఎదురవుతాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో సంబంధాలు నెలకొంటాయి. బంధువులను కలుసుకుంటారు. ఆకస్మికంగా ఎదురైన సమస్యల పట్ల దీటుగా స్పందిస్తారు.
 
కుంభం: అకాల భోజనం, శారీరశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారికి మంచి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటాయి. మీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారాలకు లాభాదాయకంగా ఉంటుంది.
 
మీనం: ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తుల పనితీరు, సమర్థతలు అధికారులను ఆకట్టుకుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments