Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 30 నుంచి తితిదే బ్రహ్మోత్సవాలు

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (14:57 IST)
సెప్టెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. 
 
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. అక్టోబరు 8వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్ 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 29వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.
 
సెప్టెంబరు 29న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం. 
అక్టోబరు 1వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
అక్టోబరు 2వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం. 
అక్టోబరు 3వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. 
అక్టోబరు 4వ తేదీన ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం (రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు). 
అక్టోబరు 5వ తేదీన హనుమంత వాహనం, రాత్రికి స్వర్ణరథం (సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు)
అక్టోబరు 6వ తేదీన సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 
అక్టోబరు 7వ తేదీన రథోత్సహం, రాత్రి అశ్వవాహనం
అక్టోబరు 8వ తేదీన చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

మంగళవారం సంకష్ట హర చతుర్థి.. కుజదోషాలు మటాష్

18-11-2024 సోమవారం ఫలితాలు - ఆ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది...

17-11-2024 ఆదివారం ఫలితాలు - ఆ రాశివారు అప్రమత్తంగా ఉండాలి...

17-11-2024 నుంచి 23-11-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments