Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-07-2019 ఆదివారం దినఫలాలు - మీ యత్నాలో నిర్లక్ష్యం తగదు...

Advertiesment
26-07-2019 ఆదివారం దినఫలాలు - మీ యత్నాలో నిర్లక్ష్యం తగదు...
, శుక్రవారం, 26 జులై 2019 (08:39 IST)
మేషం : ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. మీ ఆలోచనకూ, ఆచరణకూ మధ్యనుండే ఎడం తగ్గించుకోవాలి. వ్యాపారవేత్తలు ప్రస్తుతపరిస్థితిని కొనసాగనివ్వడం మంచిది. అనారోగ్యం మిమ్మల్ని భాదించవచ్చు. కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు మెళుకువ వహించండి.
 
వృషభం : స్త్రీలకు అనుకోని ప్రయాణాలు ఎదురుకావచ్చు. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. చేపట్టిన పనులు ముగింపుదశలో ఆసక్తిఉండదు. కళాకారులకు గౌరవం కలుగుతుంది. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసివస్తుంది.
 
మిథునం : కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. మీఖర్చులు పెరిగినప్పటికీ, రాబడికూడా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు అశ్రద్ద చేయరాదు. ఉద్యోగ, వ్యాపారాలల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. మీ యత్నాలో నిర్లక్ష్యం, పనులు వాయిదా వేయకూడదు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వివాదాలకు పోవద్దు. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం : మీరు పడ్డశ్రమకూ చేసిన కృషికి తగిన ఫలితాలు లభించేందుకిది అనుకూల సమయం. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బిల్లులు చెల్లిస్తారు. మీ యత్నాలు, తెలివితేటలూ ఓర్పుల కారణంగా మీ రంగంలో మంచి గుర్తింపును పొందుతారు.
 
కన్య : ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన పెట్టుబడులు, భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణాలు, చేబదుళ్లుతప్పక పోవచ్చు.
 
తుల : వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు, అనుభవం గడిస్తారు. బంధుమిత్రులతో పరస్పర కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ప్రముఖుల కలయికవల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆడిట్, అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
 
వృశ్చికం : కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి విషయంలోను ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. తగాదాలెప్పుడూ మనసును కలవరపెడతాయి. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు : కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి విషయంలోను ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. తగాదాలెప్పుడూ మనసును కలవరపెడతాయి. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం : గృహ వాస్తు నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. మితంగా సంభాషిస్తూ మీ ప్రత్యర్థుల జోరును పెరగకుండా చూడండి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు తప్పవు.
 
కుంభం : స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు. రాణింపు లభిస్తుంది. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. మీ మాటకు వ్యతిరేకత, అపఖ్యాతి వంటి చికాకులు అధికమవుతాయి.
 
మీనం : ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. డాక్టర్లకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. పత్రికా సిబ్బందికి, నిరుద్యోగులకు కలిసివచ్చేకాలం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవద్గీతను అర్జునుడితో పాటు ఎవరు విన్నారు?