29-05-2020 శుక్రవారం దినఫలాలు - గౌరీదేవిని ఆరాధిస్తే మనోసిద్ధి..

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (05:00 IST)
మేషం : రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు స్థానమార్పిడికై చేయుయత్నాలు అనుకూలించవు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆకస్మిక ఖర్చులు చెల్లింపులు వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ అవసరం. 
 
వృషభం : ఆలయ సందర్శనాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితంలేకుండా చేస్తాయి. ప్రయత్నపూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసివస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
మిథునం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. విందులలో పరిమితి పాటించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మొహమ్మాటం వీడి బంధుమిత్రులతో ఖచ్చితంగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : అధిక ఉష్ణం వల్ల మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. ఇతరులకు పెద్ద మొత్తం ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
కన్య : ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళకువ అవసరం. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగయత్నంలో దళారులను విశ్వసించకండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. 
 
తుల : బంధు మిత్రులతో ప్రయాణాసు సాగిస్తారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
వృశ్చికం : ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవడం మంచిదని గమనించండి. కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పదు. మధ్యవర్తిత్వం వహించండం వల్ల మాటపడక తప్పదు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి దేవా, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. 
 
మకరం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. అనుకోని విధంగా మొక్కబడులు చెల్లిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. 
 
కుంభం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ భార్యకు నచ్చకపోవచ్చు. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. రావలసినధనం అందడంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 
 
మీనం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారాలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రుణాలు తీరుస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments