28-05-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడికి పూజలు చేస్తే...

గురువారం, 28 మే 2020 (05:00 IST)
మేషం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు అనుకోని విధంగా జరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఆపరేషన్ల విషయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. కుటుంబీకుల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. బంధువుల ఇంట శుభ సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. 
 
మిథునం : రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. చేపట్టిన పనులలో నాణ్యతాలోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధువుల మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. 
 
కర్కాకటం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తికానవస్తుంది. ఒక పుణ్యక్షేత్ర సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
సింహం : కొన్ని వ్యవహారాలు అనుకూలించనా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రసాయనికి, మందులు, ఎరువులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివస్తుంది. వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
కన్య : మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడతుంది. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్ తినుబండారు వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. 
 
తుల : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఊహించని ఖర్చులు, చెల్లింపులు వల్ల స్వల్ప ఇబ్బందులెదుర్కొంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు చేసే పనియందు ధ్యాస వహించడం మంచింది. 
 
వృశ్చికం : మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. అనుకున్న మొత్తం చేతికందుతుంది. వైద్యులకు మంచి పేరు ఖ్యాతి లభిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుండి గుర్తింపు లభిస్తాయి. 
 
ధనస్సు : ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు. వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. 
 
మకరం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు వహించండి. బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం : రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఊహించని ఖర్చులు అధికం. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఏదైనా అమ్మే ఆలోచనల వాయిదావేయడం మంచిది. 
 
మీనం : బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు అనవసరు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రియతముల కోసం ధన బాగా వెచ్చిస్తారు. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ లడ్డూల విక్రయం!