Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-04-2019 సోమవారం దినఫలాలు

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (08:52 IST)
మేషం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. 
 
వృషభం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. మీ ఉత్సాహన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం.
 
మిధునం: బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండ. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారాలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాల్లో దినదినాభివృద్ధి చెందుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
కర్కాటకం: సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. చిరకాలం నుండి వేధిస్తున్న సమస్యలు పరిష్కారదిశగా ముందుకు కొనసాగుతారు.  
 
సింహం: ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఆదాయ వ్యయాల విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. నిర్మాణ పథకాలలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మీ బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. తోటలు రంగాల పట్ల ఆసక్తి పెరుగును. గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడుతాయి.  
 
తుల: ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ సంతానం భవిష్యత్తుకోసం ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనేనిస్తాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేసినా శుభదాయకం.
 
వృశ్చికం: చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాలవారికి కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించడం వలన క్షణం తీరిక ఉండదు. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు.  
 
ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఖర్చులు మీ అంచనాలను మించడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పవు. 
 
మకరం: తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఒప్పిగా వ్యవహరించండి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రతీ విషయంలోను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. ఏజెంట్లు, బ్రోకర్లు, రిప్రజెంటేటివ్‌లకు మిశ్రమ ఫలితం. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 
 
కుంభం: ఉద్యోగం ప్రమోషన్, ఇంక్రిమెంట్లు వంటి శుభవార్తలు అందుతాయి. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తారు. 
 
మీనం: ఆటోమోబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇతరుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

తర్వాతి కథనం
Show comments