Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం (24-05-18) దినఫలాలు - అభిరుచికి తగిన వ్యక్తితో ...

మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పాత వస్తువులను కొని ఇ

Webdunia
గురువారం, 24 మే 2018 (08:29 IST)
మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయుటలో విజయం సాధించగలుగుతారు.
 
వృషభం: చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. నూతన దంపతులకు సంతానయోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రైవేటు సంస్ధలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఎ.సి. కూలర్లు మెకానికల్ రంగాల వారికి సంతృప్తి కానవచ్చును. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. తరచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
సింహం: ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించటం వల్ల ఒక వ్యవహారం మీకు సానుకూలమవుతుంది.
 
కన్య: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. దూరప్రాంతాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.  
 
తుల: రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార రంగాల్లో వారికి తోటివారి వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి.
 
వృశ్చికం: భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు మెుండితనం చికాకు కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 
 
ధనస్సు: ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మకరం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి.
 
కుంభం: రాజకీయ కళా రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణలు మంచిది కాదని గమినించండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులలో ఇబ్బందులు తెలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
మీనం: విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు ఆందోళనలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉండగలదు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments