Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-05-2018 - సోమవారం మీ రాశి ఫలితాలు.. స్త్రీలతో మితంగా..

మేషం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసివస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాడపట్టింపులు తప్పవు. బ్యాంకుల ను

21-05-2018 - సోమవారం మీ రాశి ఫలితాలు.. స్త్రీలతో మితంగా..
, సోమవారం, 21 మే 2018 (08:50 IST)
మేషం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసివస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాడపట్టింపులు తప్పవు. బ్యాంకుల నుంచి పెద్దమెుత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి.
 
వృషభం: వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందివచ్చిన అవకాశం చేజారినా శ్రమాధిక్యత ఒకందకు మంచిదేనని అనిపిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మిథునం: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పోగొట్టుకున్న పత్రాలకు నకళ్లు పొందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం మంచిది కాదు. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఓర్పు, నేర్పు మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రముఖులు, స్త్రీలతో మితంగా సంభాషించండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
సింహం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. 
 
కన్య: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. 
 
తుల: కోళ్ళ, మత్స్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ఆటోమొబైల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది.   
 
వృశ్చికం: వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గత తప్పిదాలు పురావృతమయ్యే సూచనలున్నయి. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిదికాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
ధనుస్సు: చేతివృత్తులు, కేటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసివస్తుంది. నిరుద్యోగులు తాత్కాలిక ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల అధికారులతో ఏకీభవించలేకపోతారు. క్రీడల్లో పాల్గొంటారు.  
 
మకరం: పారిశ్రామిక రంగంలో వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. 
 
కుంభం: రాజకీయాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు పనివారలను ఓ కంటకనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మీనం: పెద్దమెుత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. క్యాటరింగ్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక పనులు సానుకూలమవుతాయి. సొంత వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారో? నాలాంటి అర్చకులను తొలగిస్తే?