Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-05-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. దంపతుల మధ్య కలహాలు..?

మేషం: ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోను మీరే నిర్ణయం తీసుకోవటం మంచిదని గమనించండి. కొరియల్ రంగాల వారికి పనిభా

Advertiesment
daily horoscope
మేషం: ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోను మీరే నిర్ణయం తీసుకోవటం మంచిదని గమనించండి. కొరియల్ రంగాల వారికి పనిభారం తప్పదు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. 
 
వృషభం: విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి, వ్యాపారాలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రుణాలు తీరుస్తారు.
 
మిథునం: క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పని భారం బాగా పెరుగుతుంది.
 
సింహం: ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత చాలా అవసరం. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారి నుండి ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. ఎగుమతి, దిగుమతులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలోనూ, సభా కార్యక్రమాలలోను మెళకువ, ఏకాగ్రత అవసరం.
 
కన్య: వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. సంస్థల నుంచి పారితోషికం అందుతాయి. సాహస ప్రయత్నాలు విరమించడం మంచిది. 
 
తుల: కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. కొంతమంది మీ నుంచి పెద్దమెుత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. హోటల్, తినుబండ రంగాల్లో వారికి లాభదాయకం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాల్లో వారికి శుభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం: ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అధిక ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది.  
 
ధనస్సు: బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం: బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం, పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సమకూర్చుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. 
 
కుంభం: కీలక నిర్ణయాలలో కుటుంబీకుల చేయూత లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. చేపట్టిన ఉపాధి పథకాలను ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు బంధువుల నుంచి మెుహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది.   
 
మీనం: చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి, పనివారలకు ఆశాజనకం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావటంతో తీరిక, విశ్రాంతి ఉండవు. విద్యార్థులు ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితమంతా యాతనలు పడ్డాక ఆ రహస్యం తెలుస్తుంది