Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (20-05-2018) మీ రాశి ఫలితాలు.. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం..?

మేషం: ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలా

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 20 మే 2018 (09:43 IST)
మేషం: ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బంధువుల రాకతో దుబారా ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రయాణాలు అనుకూలం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం: నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల బిల్డర్లు కష్టనష్టాలను ఎదుర్కుంటారు. బంధుమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. స్త్రీలు టీవీ, ఛానల్స్ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు జాగ్రత్త వహించండి. కుటుంబీకులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు క్షేమదాయకం కాదు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహాకారాలు అందిస్తారు.
 
సింహం: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. బంధువులతో మాటపట్టింపులు తలెత్తుతాయి.
 
కన్య: రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. పెద్దల ఆశీస్సులు, బంధువుల ప్రశంసలు పొందుతారు. దుబారా ఖర్చులు అధికమవ్వడం వల్ల ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. నిరుద్యోగులకు ప్రకటనలు పట్ల అవగాహన ముఖ్యం. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. 
 
తుల: కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండారాల వ్యాపారులకు కలిసివస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
వృశ్చికం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతే చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. రాజకీయ, కళా రంగాల్లోవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో స్వల్ప ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది.
 
మకరం: సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం.
 
కుంభం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు.
 
మీనం: వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 20 నుంచి 26 మే 2018 వరకు వార రాశి ఫలితాలు(Video)