Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 20 నుంచి 26 మే 2018 వరకు వార రాశి ఫలితాలు(Video)

మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 25న సర్వ ఏకాదశి, ముఖ్యమైన పనులకు దశమి, గురువారం శుభదినం.

Advertiesment
Weekly Horoscope 2018
, శనివారం, 19 మే 2018 (20:34 IST)
మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. కర్కాటక, సింహ, కన్య, తులల్లో చంద్రుడు. 25న సర్వ ఏకాదశి, ముఖ్యమైన పనులకు దశమి, గురువారం శుభదినం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాలను కచ్చితంగా తెలియజేయండి. గురు, శుక్ర వారాల్లో మెుహమాటాలు, భేషజాలకు పోవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనంపై దృష్టి పెడతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు వాయిదా పడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శనివారం నాడు బాధ్యతగా వ్యవహరించాలి. మితంగా సంభాషించండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. బంధువులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. అధికారులకు స్థానచలనం, అదనపు బాధ్యతలు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆశాజనకం. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహమార్పు అనివార్యం. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. రుణయత్నాలు ఫలించవు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. గత తప్పిదాలు పునరావృతమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ప్రముఖులు సందర్శనం సాధ్యం కాదు. అనేక పనులతో సతమతమవుతారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సాయం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంతానం అత్యుత్సాహాం ఇబ్బంది కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి సారిస్తారు. ఆది, సోమ వారాల్లో ప్రకటనలు, ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. పర్మిట్లు, లైసెన్స్‌ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త వ్యక్తులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి రాగలవు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొద్దిమెుత్తం సాయం అందించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. గురు, శుక్ర వారాల్లో అతిగా ఆలోచింపవద్దు. పెద్దల సలహా తీసుకోండి. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. సంతానం ఉన్నత చదువుల శ్రద్ధ అవసరం. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దుత. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు అనేక పనులతో సతమతమవుతారు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. పెట్టుబడులకు అనుకూలం. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్నిస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులు సిద్ధంగా వుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. ఆది, సోమవారాల్లో మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. గృహ నిర్మాణానికి వనరులు సర్దుబాటవుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు స్థానచలనం. ఉపాధ్యాయులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. 
 
మకరం:
గృహంలో సందడి నెలకొంటుంది. విలాసాలకు విపరీతం వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం వుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మంగళ, బుధవారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సంతానం దూకుడును అదుపు చేయండి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. విమర్శలు, అభియోగాలు ఎదురవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. ఆది, గురువారాల్లో ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. జూదాల జోలికి పోవద్దు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
మీ వాక్కు ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పనులు చురుకుగా సాగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మంగళ, శనివారాల్లో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం పరమేశ్వరునికి దద్దోజనం సమర్పిస్తే ఏమవుతుంది?