Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ వార రాశి ఫలితాలు... 13 మే నుంచి 19 మే వరకు (Video)

మేషంలో రవి, బుధులు, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మీన, మేష, వృషభ, మిధునంలో చంద్రుడు. 14న రవి వృషభం నందు, శుక్రుడు మిధునం నందు ప్రవేశం. 14 మాస శివరాత్రి.

Advertiesment
మీ వార రాశి ఫలితాలు... 13 మే నుంచి 19 మే వరకు (Video)
, శనివారం, 12 మే 2018 (19:46 IST)
మేషంలో రవి, బుధులు, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మీన, మేష, వృషభ, మిధునంలో చంద్రుడు. 14న రవి వృషభం నందు, శుక్రుడు మిధునం నందు ప్రవేశం. 14 మాస శివరాత్రి.
 
మేషం: అశ్వని భరణి, కృత్తిక 1వ పాదం 
సంతానం ద్వారా శుభవార్త వింటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆది, సోమ వారాల్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్ధాపనలకు అనుకూలం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పురోగతిన సాగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రుణ, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. పనుల ప్రారంభంలో అవాంతరాలెదుర్కుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. మంగళ, బుధవారాల్లో ప్రకటనలు, అపరిచితులను నమ్మవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు, విశ్రాంతి లోపం.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. డీలర్లకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి చికాకులు అధికం. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. శనివారం నాడు ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు వనరులు సర్దుబాటు చేసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ బాధలు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టుదలను పెంచుతాయి. ఆది, సోమ, వారాల్లో కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ అవసరం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పదవుల స్వీకరణకు అనుకూలం. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపార విస్తరణలకు అనుకూలం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. దుబారా ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారులకు చికాకులు అధికం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కొంత మెుత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, శని వారాల్లో మీ జోక్యం అనివార్యం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాల ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషపరుస్తుంది. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ మాటకు స్పందన లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గురు, శుక్ర వారాల్లో నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. పందాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఇంటా బయటా అనుకూలతలున్నాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శనివారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వృత్తిపరమైన ఇబ్బందులెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3, పాదాలు
విజయం సంతోషాన్నిస్తుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఊహించని ఖర్చులుంటాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సంతానం అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పదవులు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనలాభం, పదోన్నతి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహం ప్రశాంతంగా ఉంటుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి, ఆర్థికంగా బాగుంటుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, విలువైన పత్రాలు జాగ్రత్త. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. రచయితలకు ప్రోత్సాహకరం.
వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాశుర ప్రభావం గురించి? ఎందుకు?