Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-01-2019 గురువారం దినఫలాలు - స్త్రీలు అపరిచిత వ్యక్తులకు...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (08:39 IST)
మేషం: మీ మిత్రుల కోసం బంధువుల కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు అనుకూలం. మీ నూతన పథకాలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి.
 
వృషభం: స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. మ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. 
 
మిధునం: సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
కర్కాటకం: చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఋణవిముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడుతారు. బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యా, భర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు.  
 
సింహం: నిరద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒక కార్యసాధకోసం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.  
 
కన్య: ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో మెళకువ వహించండి. అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. ఓర్పు సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వలన సమస్య పరిష్కారమవుతుంది. మీ సంతానం విపరీత ధోరణి వలన అసహానానికి లోనవుతారు.  
 
తుల: వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయమవుతారు. స్త్రీలకు బంధువులలో సఖ్యత నెలకొంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనమును విరివిగా ఖర్చులు చేస్తారు. 
 
వృశ్చికం: తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏ కార్యములు చేయవద్దు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య చిరు కలహాలు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి.  
 
ధనస్సు: ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఆలయాలను సందర్శిస్తారు. వాయిదాలు తీసుకోవడం మంచిది. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండడం క్షేమదాయకం. తరచూ ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. వైద్యులలు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం.    
 
కుంభం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం.   
 
మీనం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ యత్నాలకు ప్రమఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు అధికమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

తర్వాతి కథనం
Show comments