Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-01-2019 ఆదివారం దినఫలాలు - ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి...

Advertiesment
20-01-2019 ఆదివారం దినఫలాలు - ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి...
, ఆదివారం, 20 జనవరి 2019 (08:32 IST)
మేషం: విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార రీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాల్లో చాలా ఆనందకరమైన జీవనం సాగిస్తారు. రాజకీయనాయకులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరీసోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం: కుటుంబ సభ్యులతో కలికి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిధునం: షాపుల అలంకరణ, కొత్త కొత్త స్కీములతో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుత్తం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం: వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టే యత్నాలు విరమించడం మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదై పైచేయిగా ఉంటుంది. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది. ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు.  
 
సింహం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కన్య: జూదాలు, వ్యసనాల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగల్గురు. ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకోవద్దు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి.  
 
తుల: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాలి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సమస్యలను ఎదుర్కుంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులతో కలిగి విందు, వినోదాలలో పాల్గొంటారు. హోటల్, స్టాక్ మార్కెట్స్ లాభాల దిశగా సాగుతాయి. రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి. 
 
ధనస్సు: ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు ఆటుపోట్లు ఎదుర్కొనక తప్పదు. ధన వ్యయంతోనే సమస్యలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
మకరం: ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. బంధువులు, అయిన వారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిది. విక్రయాలు బాగున్నా లాభాలు అంతంత మాత్రమే. అధికారుల వేధింపులు, తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.     
 
కుంభం: వ్యాపారాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాసలు ఎదుర్కుంటారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి.   
 
మీనం: వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. పందాలు, పోటీలలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించడం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ సంతానం భవిష్యత్తు కోసం నూతన పథకాలు చేపడతారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా?