Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా?

Advertiesment
Spiritual quotes
, శనివారం, 19 జనవరి 2019 (21:08 IST)
1. నాయకత్వం వహించేవారు ఎప్పుడూ ఆశావాదంతో ఉండాలి.
 
2. ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండాలి. దాన్ని చేరుకోవడానికై ఓపికగా పరిశ్రమించాలి.
 
3. ధైర్యవంతులకే పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది.
 
4. జీవించేందుకే మనిషి తినాలి. సమాజ శ్రేయస్సు కోసమే మనిషి జీవించాలి.
 
5. స్వధర్మాన్ని పాటించేటప్పుడు మృత్యువు దాపురించినా మంచిదే.
 
6. క్షేత్రమెరిగి విత్తనం- పాత్రమెరిగి దానం చేయాలి. అప్పుడే అవి సత్ఫలితాలను ఇస్తాయి.
 
7. దేవుడు మనం అడిగింది ఇస్తాడు, తప్పు చేస్తే క్షమిస్తాడు- మనిషి ఏదిచ్చినా తీసుకుంటాడు. అవసరం తీరాక మర్చిపోతాడు.
 
8. కొండంత సూక్తులు చెప్పడం కంటే, గోరంత సాయం చేయడం ఎంతో మేలు.
 
9. తప్పు చేస్తే ఒప్పుకో-బాధ తగ్గుతుంది. ఒప్పు చేస్తే ఎవరికీ చెప్పకు- అహంకారం దూరమవుతుంది.
 
10. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన భాష మౌనం ఒక్కటే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-01-2019 నుంచి 26-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)