1. బ్రహ్మచర్యం వలన అద్భుతమైన సామర్థ్యమూ,
బ్రహ్మండమైన సంకల్పశక్తీ కలుగుతాయి.
బ్రహ్మచర్మం లేనిదే ఎట్టి ఆధ్యాత్మిక శక్తీ
కలుగదు. ఇంద్రియ నిగ్రహం పట్ల మానవకోటిపై అద్భుతమైన వశీకరణ శక్తి లభిస్తుంది...
2. నాయకత్వం వహించేవారు సేవకునిగా,
సహనంతో ఉన్నప్పుడే విజయం సాధిస్తారు.
3. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా..
జీవించడం కాదు.. ఆనందంగా జీవించడం...
4. అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం
కన్నా.. కష్టార్జితంతో తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది.
5. పట్టుబట్టి సాధించుకోవలసింది కీర్తి, పదిలంగా
సంరక్షించుకోవలసింది గౌరవం..