1. మనిషికి.. కత్తినిచ్చి వీరుణ్ణి...
పుస్తకాలిచ్చి మేధావిని చెయ్యొచ్చు..
కానీ.. మంచివాడు కావాలంటే మాత్రం..
మనసుండాలే తప్ప.. అది మనం ఇవ్వలేము..
2. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు..
విమర్శించే వారందరూ శత్రువులూ కారు..
పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం.. ఉండవచ్చు..
విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు ఉండవచ్చు..
3. ఒక్కే ఒక్క మాట..
వెయ్యిమందిని మిత్రులుగా చేస్తుంది..
ఒక్కే ఒక్క మాట..
వెయ్యి మందిని శత్రువులుగా కూడా మార్చగలదు..
ఒక్క మాటకు అంతటి శక్తి ఉంది..
అందుకే ఆలోచించి మాట్లాడాలి..
4. జీవితం విలువ తెలిసినోడు
ఎప్పుడూ ఇతరుల కష్టాలను చూసి ఎగతాళి చేయడు...
5. గమ్యం వైపు వెళ్ళే దారిలో.. ఎన్నో కుక్కలు మనల్ని చూసి మొరగవచ్చు..
అందుకు మనం ఆవేశపడిపోయి.. వాటి పళ్ళు ఊడగొట్టి.. తగిన పాఠం చెప్పాలనుకుని..
మొరిగిన ప్రతి కుక్క మీదా రాళ్ళు విసురుతూ కూచుంటే.. మనం ఇక ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేం...