Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-01-2019 బుధవారం దినఫలాలు - తలచిన పనులు నెరవేరి...

Advertiesment
23-01-2019 బుధవారం దినఫలాలు - తలచిన పనులు నెరవేరి...
, బుధవారం, 23 జనవరి 2019 (08:59 IST)
మేషం: దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టుకు హాజరవుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహానానికి లోనవుతారు.
 
వృషభం: కోర్టు వాయిదాలకు హాజరవుతారు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. ఓ వార్త మిమ్ములను ఆశ్చర్యపరుస్తుంది. సోదరీసోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సమావేశాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు ప్రస్తావనకువస్తాయి. 
 
మిధునం: పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏకార్యములు చేయవద్దు. సాహిత్య సదస్సులలోను, బృందకార్య క్రమాల్లోను పాల్గొంటారు. దూరప్రయాణాలు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. రావలసిన ధనంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. 
 
కర్కాటకం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తికాగలవు. రుసుములు చెల్లించగలుగుతారు. మనుషుల మనస్తత్వం తెలుసుకుని మసలుట మంచిది. ప్రైవేటు సంస్థల్లోని వారికి నిరుత్సాహం కలిగిస్తుంది.  
 
సింహం: తలచిన పనులు నెరవేరి మీ కోరికలు తీరగలవు. చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. 
 
కన్య: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలుంటాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్వయం లోపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.  
 
తుల: మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లోవారికి ఒత్తిడి పెరుగుతుంది. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. తలపెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. 
 
వృశ్చికం: హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలోవారికి పురోభివృద్ధి. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. అనుకున్న మొత్తం చేతికందుతుంది. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
ధనస్సు: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. రావలసిన ధనం వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిట్స్, పైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పవు. 
 
మకరం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తి, వ్యాపారులకు సంబంధించిన విషయాలు కలవర పెడతాయి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. అందరికీ సహాయం చేసి మాటపడతారు.    
 
కుంభం: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీద ఏకాగ్రత వహించలేరు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.   
 
మీనం: ఆర్థిక సమస్యలు మెరుగుపడుతాయి. మార్కెట్ రంగాలవారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు షాపింగ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని చేయడం నేర్చుకోవాలి, పెత్తనం కాదు...