Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-02-2019 మంగళవారం దినఫలాలు - పొదుపు దిశగా మీ ఆలోచనులు

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (08:50 IST)
మేషం: కొంతమంది మీ కదలికలపై నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనులు ఉంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృషభం: భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖుల కలయిక వలన ఆశించిన ఫలితం ఉండదు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.    
 
మిధునం: ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.  
 
కర్కాటకం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలలోని వారు తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
సింహం: హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. మితిమీరిన ఆలోచనులు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
కన్య: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. వాహనం నిదానంగా నడపడం మంచిది. 
 
తుల: బోగస్ ప్రకటనల వలన నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి.  
 
వృశ్చికం: బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. 
 
ధనస్సు: పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించడం వలన పనులు వాయిదా వేసుకుంటారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. 
 
మకరం: వ్యాపారాలు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళనలు అధికమవుతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.   
 
కుంభం: మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నిరుద్యోగులు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆశక్తి అధికమవుతుంది. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.  
 
మీనం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది.  

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments