Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-02-2019 సోమవారం దినఫలాలు - మీ అతిథి మర్యాదలు అందరినీ...

Advertiesment
18-02-2019 సోమవారం దినఫలాలు - మీ అతిథి మర్యాదలు అందరినీ...
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:09 IST)
మేషం: గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. శ్రీమతి అభిప్రాయాలను తేలికగా కొట్టివేయడం మంచిది కాదు. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. తొందరపాటు చర్యల వలన వ్యవహారం బెడిసికొట్టవచ్చు.
 
వృషభం: హోటర్, క్యాటరింగ్, తినుబండారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించాలి. మీరు ఇచ్చే సలహాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది.  
 
మిధునం: వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, ఏ వ్యవహారం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. 
 
కర్కాటకం: రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్త్రీలకు కాళ్ళు, నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.  
 
సింహం: మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పుడుతాయి. రాజకీయాలలోనివారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు వాయిదా పడుతాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
కన్య: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. బంధువులను కలుసుకుంటారు. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. సోదరీసోదరులతో ఏకీభవించలేరు. 
 
తుల: ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఋణం తీర్చడానికే చేయు యత్నాలు ఫలిస్తాయి. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.  
 
వృశ్చికం: కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించు కోగలుగుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేక పోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. 
 
ధనస్సు: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. వైద్యరంగాల వారికి అన్నివిధాలా శుభం కలుగుతుంది. ధనం మితంగా వ్యయం చేయండి. 
 
మకరం: వాతావరణంలో మార్పు వలన ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది. వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో మెళకువ అవసరం. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. ధాన్యం, అపరాలు, కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్కేకాలం.   
 
కుంభం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మీనం: కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం...