Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-10-2018 బుధవారం దినఫలాలు - కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (09:44 IST)
మేషం: ఉమ్మడి వ్యవహారాలు, భాగస్వామిక వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు కానవస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి సామాన్యం.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, కిరణా, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడక స్వయంకృషిని నమ్ముకోవడం ఉత్తమం. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. పత్రికా రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.   
 
మిధునం: ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల్లో వారికి ఒడిదుకులు తప్పవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
కర్కాటకం: వేడుకలను ఘనంగా జరుపుతారు. బంధువులను ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. తరచు సేవ, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతురులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. 
 
సింహం: బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారిక మార్పులే అనుకూలిస్తాయి. మీకు కావలసిన వస్తువు లేక పత్రాలు కనిపించకుండా పోయే ఆస్కాం ఉంది. బాకీలు వసూలు కాకపోవడంతో ఆందోళన చెందుతారు. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది.   
 
కన్య: రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి.  
 
తుల: ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కుంటారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.  
 
వృశ్చికం: స్త్రీలకు షాపింగ్ విషయాలలో ఏకాగ్రత మెళకువ చాలా అవసరం. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. మీరంటే పడని వ్యక్తులు మీ వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎంతో శ్రమించినగానీ అనుకున్న పనులు పూర్తికావు.   
 
ధనస్సు: బంధుమిత్రులను విందులకు ఆహ్వానిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి.  
 
మకరం: ఆత్మీయులక కలయిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రయణాలలో మెళకువ అవసరం.  
 
కుంభం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు కలిగిరాగలదు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ వ్యాఖ్యాలను అపార్థం చేసుకుంటారు. బంధువుల రాకతో మీ పనులు వాయిదా వేసుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.    
 
మీనం: ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. హోటల్, తినుబండ వ్యాపారుస్తులకు సంతృప్తికానవచ్చును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల రాక వలన మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చతుర్థి వ్రతం- సంకటాలన్నీ మటాష్.. అదృష్టం వరిస్తుంది..

03-01-2025 శుక్రవారం దినఫలితాలు : ఆప్తులకు కానుకలు అందిస్తారు...

2024లో తిరుమల వేంకటేశుని హుండీ ఆదాయం రూ. 1365 కోట్లు

02-01-2025 గురువారం దినఫలితాలు : బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు...

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

తర్వాతి కథనం
Show comments