Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-10-2018 మంగళవారం మీ రాశిఫలితాలు - బంధుమిత్రులను కలుసుకుంటారు..

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (10:00 IST)
మేషం: తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడుతారు. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మెుదలెడతారు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.
 
వృషభం: కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. ఉద్యోగులు గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.  
 
మిధునం: స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో అవున్న పనులు పునఃప్రారంభమవుతాయి. హామీలు ఉండుట వలన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అపార్థాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. భాగస్వామితో కానీ, మీకు అత్యంత సన్నిహితులైన వారితో కానీ చిన్న వివాదం ఏర్పడవచ్చు.    
 
కర్కాటకం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశాజనకం. వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం: ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. ధనం అధికంగా వ్యయం చేస్తారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నగధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి.   
 
కన్య: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు లాభదాయకం. నిరుద్యోగుల ఆలోచనులు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. ప్రయాణాలలో మెళకువ వహించండి. మెుండి బాకీలు వసూళు కాగలవు. అనుకున్న పనులు కొంతముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.  
 
తుల: బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.  
 
వృశ్చికం: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీల ఆలోచనలు పలువిధాలుగా ఉండి దేనియందు ఆసక్తి ఉండదు.  
 
ధనస్సు: ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ, బాధ్యతల మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల మీ కుటుంబ విషయాల్లో తలదూర్చడం వలన సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నెలాఖరులో కొన్ని సమస్యలు దూరమవుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.  
 
మకరం: తరచు సేవ, దైవా కార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. చేతి వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. 
 
కుంభం: వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీల సౌఖ్యం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ఆపద సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.  
 
మీనం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. అదనపు సంపాదనకోసం మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రింటింగ్ పనివారికి పనిభారం, ఒత్తిడి తప్పవు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: అదానీతో మనకేంటి సంబంధం.. రక్షణ కేంద్రం ఏర్పాటైంది అంతే: రేవంత్ రెడ్డి

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments