Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (12-09-2018) దినఫలాలు - చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల...

మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయాల్లో వారికి విరోధ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (08:47 IST)
మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మిత్రులకిచ్చిన మాటకోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది.
 
వృషభం: విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతుంది. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
మిధునం: విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల నుండి విలు
వైన సమాచారం సేకరిస్తారు. మీ సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి.   
 
కర్కాటకం: ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విదేశాలలోని మీ బంధుమిత్రుల వర్గ సహాయ సహకారాలను అందుకుంటారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
సింహం: మీ సంతానం కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. 
 
కన్య: అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. దైవసేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు ఆందోళన కలిగిస్తాయి. ఊహించని వ్యక్తుల నుండి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది.  
 
తుల: స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కొత్త కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
వృశ్చికం: ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మనస్సుకు నచ్చని సంఘనటలు జరుగుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తికావు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వలన నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి.  
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిగిరాగలదు. తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. సోదరీసోదరులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.  
 
కుంభం: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాల్లో నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయత్నపూర్వకంగా మెుండి బాకీలు వసూలుకాగలవు. 
 
మీనం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించిన చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments