Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-09-2018 మంగళవారం దినఫలాలు - ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే...

మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏ యత్నం ఫలించకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగుల నిర్లక్ష్యం వలన ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్‌లో ఏక

Advertiesment
11-09-2018 మంగళవారం దినఫలాలు - ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే...
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (08:37 IST)
మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏ యత్నం ఫలించకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగుల నిర్లక్ష్యం వలన ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్‌లో ఏకాగ్రత వహిస్తారు. వాతావరణంలోని మార్పులు వలన మీ పనులు వాయిదా పడుతాయి.
 
వృషభం: రాజకీయాలలోని వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. విద్యుత్ రంగాల్లో వారు మాటపడవలసి వస్తుంది. మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి.  
 
మిధునం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కళా, క్రీడా రంగాలలోని వారికి కలిసిరాగలదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
 
సింహం: ఉద్యోగ రీత్య తరచు దూరప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం. అప్రయత్న కార్యసిద్ధి ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు. శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయాలలో వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. 
 
కన్య: ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. రాజకీయనాయకుల పర్యటనల్లో ఇబ్బందులు వంటివి ఎదుర్కొనక తప్పదు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో ఏకాగ్రత అవసరం. 
 
తుల: వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వలన అభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. విదేశీ యానం రుణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.  
 
వృశ్చికం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టుకు హాజరవుతారు. పెంపుడు జంతువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం విషంయలో మెళకువ వహించండి.  
 
ధనస్సు: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. రావలసిన ధనం చేతికందడంతో మానసికంగా కుదుటపడుతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
మకరం: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. మనసుని లగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టి ఆశించిన ఫలితాలు వచ్చే వరకు శ్రమించండి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాక వలన ప్రయాణాలు వాయిదా వేస్తారు. 
 
కుంభం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మీనం: దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. వీలైనంత వరకు రుణాలు చేయకుండా ఉంటే మంచిది. స్త్రీల కోరికలు నెరవేరకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. దూరప్రదేశంలో ఉన్న సంతానాన్ని బంధువులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుడిని పూజిస్తే?