Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం (07-07-2018) దినఫలాలు - మానసిక ప్రశాంతత...

మేషం: ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. ముఖ్యుల ఆరోగ్యము మిమ్మల్ని నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరత్ర సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్త

Webdunia
శనివారం, 7 జులై 2018 (08:51 IST)
మేషం: ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. ముఖ్యుల ఆరోగ్యము మిమ్మల్ని నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరత్ర సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి.
 
వృషభం: అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానయినా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.    
 
మిధునం: మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటువుతుంది. బ్యాంకు పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మెుదలు పెడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
కర్కాటకం: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.  
 
సింహం: చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. రాజకీయాలలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దలను ప్రముఖులను కలుస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి.
 
కన్య: ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది.గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. రాజకీయాలలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. 
 
తుల: ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదవకాశాలు లభించగలవు. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొన్ని వ్యవహారాలలో జరిగిన కాలయాపన వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. మెుండి బాకీలు సైతం వసూలుకాగలవు. 
 
ధనస్సు: ఊహించని ఖర్చుల వలన అధిక ధనవ్యయం తప్పదు. మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా అమ్మాకానికై చేయు యత్నాలు వాయిదా పడగలవు. 
 
మకరం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కుంభం: బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ప్రేమించే వారి వలన కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. 
 
మీనం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలు గృహోపరకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments