Webdunia - Bharat's app for daily news and videos

Install App

5-01-2018 శుక్రవారం ... ఆలోచనలు గోప్యంగా ఉంచండి...

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ఆసక్తి, ఉత్సాహ

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (08:24 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు  ప్రోత్సాహం లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రేమికుల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
వృషభం : విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యం ఉంచండి. వాక్చాతుర్యంతో వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. 
 
మిథునం : ఉద్యోగ వేతన సమస్యలు వంటివి ఏర్పడతాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. పూలు, కొబ్బరి, పండ్ల వ్యాపారులకు అనుకూలం. పరిశోధనల విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఎదురుకావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం: పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది. మిమ్మల్ని పొగిడే వారే  కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
సింహం: కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సమర్థతకు తగిన సదవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ధిపొందటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. బ్రోకర్లకు, కమీషన్ ఏజెంట్లకు కలిసివచ్చే కాలం. కృషి రంగానికి అవసరమైన వస్తువులు రవాణా చేసుకుంటారు. 
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి.
 
తుల: వ్యాపారంలో అనుభవం, లాభాలు గడిస్తారు. స్త్రీలు పరిచయం లేని వ్యక్తులతో మితంగా మాట్లాడటం మంచిది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వుంటుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ధనం కంటే మీ ఆత్మగౌరవానికే విలువనిస్తారు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నములలో ఉన్నవారికి శుభఫలితములను పొందుతారు. స్థిరాస్థిని కొనుగోలు చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు: భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిర్మాణాత్మకమైన పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. ఇతరుల వాహనం నడపటం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు.
 
మకరం: ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. రుణాలు తీర్చగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారికి అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం: ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పవు. క్రీడ కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రయాణాల్లో చికాకులు వంటివి తలెత్తుతాయి.
 
మీనం: నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. మీ ఆశయసాధనకు ఉన్నతస్థాయి వ్యక్తులు సహకారం లభిస్తుంది.  ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments