Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-01-18 తేదీ దినఫలాలు... రుణ విముక్తులవుతారు....

మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. విదేశీ ప్రయాణాలు వాయిదాపడతాయి. విద్యార్థులు, కళాత్మక క్రీడా పోటీల్లో విజయం సాధిస్

04-01-18 తేదీ దినఫలాలు... రుణ విముక్తులవుతారు....
, గురువారం, 4 జనవరి 2018 (06:45 IST)
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. విదేశీ ప్రయాణాలు వాయిదాపడతాయి. విద్యార్థులు, కళాత్మక క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
వృషభం : బంధువుల కోసం మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. పాత బాకీలు, వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారాలకు ఆశాజనకం. 
 
మిథునం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు అధికం. 
 
కర్కాటకం : సాంస్కృతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రత్యర్థులు మీకు అనూహ్యంగా మద్దతు ఇస్తారు. మీలో ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభించగలవు. ఖర్చులు అధికమవుతాయి. 
 
సింహం : గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు పెండింగ్ పనుల పూర్తిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటారు. ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్ధంగా ఉంటాయి. స్త్రీల, కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ముఖ్యమైన పనులు మీరే చేసుకోవడం మంచిది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. 
 
తుల : ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. విద్యార్థుల నిరంతర కృషి అవసరమని గమనించండి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు అశాజనకం. 
 
వృశ్చికం : వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడతాయి. ప్రైవేట్, ఫైనాన్స్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కొనక తప్పదు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారం, అధికారుల ప్రశంసలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : చేపట్టిన పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. దైవకార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులలో అవగాహన లోపం. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడతుంది. నూతన దంపతుల్లో ఉత్సాహం, కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలి. 
 
మీనం : బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మాటపడవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ విషయాల పట్ల మీ వైఖరిలో మార్పు వస్తుంది. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం చేస్తుంటాం సరే... ఏ వైపు తిరిగి చేయాలో తెలుసా?