Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

January 1, 2018- సోమవారం రాశి ఫలితాలు.. ప్రేమికులు తొందరపాటుతో

మేషం: కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ నూతన ఆలోచనలను క్రియారూపంలో పెట్టి జయం పొందండి. ప్రముఖులక

Advertiesment
January 1, 2018- సోమవారం రాశి ఫలితాలు.. ప్రేమికులు తొందరపాటుతో
, సోమవారం, 1 జనవరి 2018 (05:50 IST)
మేషం: కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ నూతన ఆలోచనలను క్రియారూపంలో పెట్టి జయం పొందండి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు.
 
వృషభం: ప్రముఖ ఆలయాల్లో దైవ దర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధ బాంధవ్యాలు నెలకొని ఉంటాయి.
 
మిథునం: విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్స్‌లు, లీవులు మంజూరవుతాయి. ముక్కుసూటిగా పోయే మీ స్వభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తుల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తుతాయి.
 
కర్కాటకం: శుభాకాంక్షలు అందజేస్తారు. ప్రేమికులు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు మరింత బలపడతాయి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాల్లో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు.
 
సింహం: మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, విలువైన బహుమతులు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. చేపట్టిన పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపుతో స్థిమితపడతారు.
 
కన్య: తరచుగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తొలగిపోతాయి. వ్యాపారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసివస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల: నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. నూతన వ్యక్తుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపార రహస్యాలు, ఆర్థిక లావాదేవీలను గోప్యంగా ఉంచండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.
 
వృశ్చికం: సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రుణం తీర్చడానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెళకువ వహించండి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: సహోద్యోగులకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారులకు కలిసిరాగలదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ఖర్చులు అదుపు చేయలేరు. మరింత ధనవ్యయం అవుతుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం: కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి బాగుగా కలిసివస్తుంది. కొత్త వ్యక్తులను దరిచేరనివ్వకండి. స్త్రీలకు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. నిర్వహణ లోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కుంభం: ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అందజేస్తారు. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
మీనం: స్త్రీలకు సేవా కార్యక్రమాల పట్ల, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానాలతో ఆనందాన్ని పాలు పంచుకుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'ని ఉత్తర దిశలో వుంచితే?