Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజు హనుమంతుడిని పూజిస్తే..?

Webdunia
సోమవారం, 10 మే 2021 (14:56 IST)
అమావాస్య రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. రామదూత అయిన హనుమంతుడు శివుని అంశంగా పరిగణింపబడతాడు. 
 
రామాయణంలో శ్రీ మహావిష్ణువు రామునిగా, శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా కనిపిస్తారు. అలాంటి రామాయణంలో భాగం కావాలని శివునికి ఆశ ఏర్పడింది. అలాగే రామాయణంలో రామునికి సేవ చేయాలని శివుడు భావించాడు. తద్వారా శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రామాయణంలో రామునికి సేవ చేశాడు. ఎక్కడంతా రామనామం వినిపిస్తుంటే.. అక్కడ ఆంజనేయ స్వామి అమరియుంటాడు. 
 
రామునికి ఎక్కడ ఉత్సవం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి భక్తులతో భక్తుడిగా కలిసిపోతాడు. అలాంటి ఆంజనేయుడిని పూజిస్తే అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది. 
 
ఇంకా మంగళవారం పూట అమావాస్య రోజు ఆంజనేయ స్వామిని పూజించే వారికి సర్వ మంగళం చేకూరుతుంది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అమావాస్య రోజున తమలపాకుల మాల, వడమాల, వెన్నతో అభిషేకాన్ని హనుమకు చేయిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

తర్వాతి కథనం
Show comments