Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున.. బంగారం, వెండి ఎప్పుడు కొనాలి..?

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:54 IST)
Gold
చైత్ర మాసంలో వచ్చే తృతీయ తిథి అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ తిథి నాడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా విష్ణువు పూజ చేయడం మంచిది. ఈ రోజున అష్టలక్ష్మిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వస్తువులు కొనుగోలు చేస్తే అది వృద్ధి చెందుతుంది. అక్షయ అంటే తగ్గని అక్షయ పాత్ర. అక్షయ తృతీయ నాడు ఏ శుభ వస్తువు కొనుగోలు చేసినా ఐశ్వర్యం చేకూరుతుంది. 
 
ఈ రోజున ధాన్యాలు, ఉప్పు, పసుపు, దీపం, కంచు గంట, లక్ష్మీ చిత్రం, డబ్బు, కుంకుమ, గంధం, పంచదార ఇలా ఏ శుభ వస్తువు అయినా అదృష్ట తృతీయ నాడు కొనుగోలు చేయవచ్చు.
 
బంగారం బృహస్పతిని సూచిస్తుంది. వెండి శుక్రుడిని సూచిస్తుంది. వీరిద్దరి అనుగ్రహం కొనసాగితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందనేదే బంగారం, వెండి కొనుగోలుకు ప్రధాన కారణాలు. 
 
అక్షయ తృతీయ (ఏప్రిల్ 22) రోజున ఉదయం 7 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. బంగారం, వెండిని కూడా ఉదయం 10-11 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల మధ్య కొనుగోలు చేయవచ్చు. 
Gold
 
ఏప్రిల్ 23 ఉదయం 7 నుండి 8 గంటల వరకు, తరువాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బంగారం, వెండి, ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. బంగారం, వెండి కొనలేని వారు పైన పేర్కొన్న మంగళకరమైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

తర్వాతి కథనం
Show comments