తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న చరాస్తులు ఒకనాడు సంచలనాత్మకంగా మారాయి. 2003లో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించేందుకు రంగ సిద్ధమైంది. అక్రమార్జన కేసులో స్వాధీనం చేసుకున్న జయలలిత చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అడ్వకేట్ కిరణ్ ఎస్. జావలిని కర్నాటక ప్రభుత్వం నియమించింది. ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఆ రోజు సంచలనాత్మకంగా మారాయి.
భారీ స్థాయిలో నగలు, వజ్రాభరణాలు, వందలాది వెండి వస్తువులు, చెప్పులు సైతం పెద్ద మొత్తంలో అధికారులు ఆరోజులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు, 11 వేల చీరలు, 750 జతలు చెప్పులు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిడ్జిలు తదితర గృహోపకరణాలు ఉన్నాయి.
జయలలితపై 2003లో నమోదైన అక్రమార్జను కేసుని గతంలో కర్నాటక కోర్టుకు బదిలీ చేశారు. కేసు బదిలీ కావడంతో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సైతం కర్నాటకు తరలించారు. ఇదే కేసులో గతంలో జయలలిత శిక్ష కూడా అనుభించారు. ప్రస్తుతం జయలలిత ఆస్తులను అమ్మకానికి పెట్టారు.