Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ చేతుల మీదుగా తెలుగు విద్యార్థినికి సత్కారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (20:32 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా తెలుగు విద్యార్థినికి సత్కారం జరిగింది. అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ ఆమె అందించిన సేవలకుగానూ అగ్రరాజ్యం అమెరికా అధినేత ఆ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. 
 
ఇటీవల అమెరికాలోని వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ ఆమె వ్యక్తిగత కార్డులను పంపింది. శ్వేతసౌథంలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రావ్యతో పాటు లైలా ఖాన్‌, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలనూ ఆయన సత్కరించారు. 
 
కాగా, మేరీల్యాండ్,‌ ఎల్క్‌రిడ్జ్‌లోని‌ ట్రూప్ 744లో ఈ బాలికలు సేవలు అందిస్తున్నారు. వారు ఇటీవల 100 బాక్స్‌ల గర్ల్స్‌ స్కౌట్స్‌‌ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి పంపారు. దీంతో శ్వేతసౌథానికి వారిని ఆహ్వానించి, ట్రంప్ అభినందనలు తెలిపారు. 
 
కాగా, హనోవర్‌లో ఉంటోన్న తెలుగు బాలిక శ్రావ్య నాలుగో తరగతి‌ చదువుతోంది. ట్రంప్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడంపై ఆ బాలిక స్పందిస్తూ, తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది. 
 
తాను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పింది. శ్రావ్య తండ్రి విజయ్‌రెడ్డి అన్నపరెడ్డి ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయనది గుంటూరు‌ కాగా, శ్రావ్య తల్లి స్వస్థలం బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments