Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్థిని

ఎన్నో ఆశలతో విదేశాలకు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ న్యూయార్క్ నగరంలోని జాన్సన్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఐతే వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అ

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (21:58 IST)
ఎన్నో ఆశలతో విదేశాలకు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ న్యూయార్క్ నగరంలోని జాన్సన్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఐతే వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె బంధువు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీలేఖ బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెకు వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసి వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. ఆమెకు అవుతున్న వైద్య ఖర్చులు పెనుభారంగా పరిణమించడంతో శ్రీలేఖ బంధువు గిరిధర్ ఆన్‌లైన్‌లో క్రౌడ్ ఫండింగ్ అనే క్యాంపెయిన్‌ను చేశారు. 
 
శ్రీలేఖ తల్లిదండ్రులు పేదవారనీ, కుమార్తె మంచి మేథస్సు కల విద్యార్థిని కావడంతో బ్యాంకు రుణం తీసుకుని ఆమెను ఉన్నత చదువుల కోసం పంపారనీ, కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనితో ఆమె వైద్య సాయం కోసం దాతలు కేవలం 5 గంటల్లోనే 59, 511 డాలర్లను విరాళంగా ఇచ్చారు. కాగా ఆమె వైద్యానికి కనీసం లక్ష డాలర్ల వరకూ ఖర్చయ్యే అవకాశం వున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తమ కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురికావడం పట్ల ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిది ఖమ్మం జిల్లా మధిర.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments