Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.. ప్రమాదానికి గురైన వ్యక్తిని రైలులో పడేశారు.. అతనేమయ్యాడంటే? (వీడియో)

ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నిర్లక్ష్య వైఖరి పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మనిషికి మనిషి సాయం చేసుకోని పరిస్థితి ఏర్పడింది. సాయం చేయాల్సిన బాధ్యతలో వున్న వ్యక్తులు కూడ

Advertiesment
రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.. ప్రమాదానికి గురైన వ్యక్తిని రైలులో పడేశారు.. అతనేమయ్యాడంటే? (వీడియో)
, బుధవారం, 23 ఆగస్టు 2017 (16:46 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నిర్లక్ష్య వైఖరి పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మనిషికి మనిషి సాయం చేసుకోని పరిస్థితి ఏర్పడింది. సాయం చేయాల్సిన బాధ్యతలో వున్న వ్యక్తులు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రైలు నుంచి కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ఆసుపత్రికి తీసుకెళ్ల‌కుండా, తీరిగ్గా తర్వాత వచ్చిన రైల్లో పడేసి తీసుకెళ్లిన కారణంగా ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. ఓ మనిషి ప్రాణాలు కోల్పోయేందుకు ముంబై రైల్వే పోలీసులు కారణమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సంపద రైల్వే స్టేషన్‌లో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ వ్యక్తి కిందపడ్డాడు. అలా ప్రమాదానికి గురైన వ్యక్తిని గంటల పాటు అలానే ఫ్లాట్ ఫామ్ మీదే వుంచారు. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా జీఆర్‌పీ పోలీసు కానిస్టేబుల్‌, అక్క‌డి హోంగార్డు సాయంతో మరో రైలు వచ్చేదాకా వేచి చూశారు. 
 
ఆ రైలు వచ్చాక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రైలులో పడేశారు. దాదాపు పది గంట‌ల త‌ర్వాత ఓ ప్ర‌యాణికుడు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా, గాయ‌ప‌డిన వ్య‌క్తిని ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆసుప‌త్రికి రావ‌డానికి ముందే అత‌ను మ‌ర‌ణించాడ‌ని వైద్యులు నిర్ధారించారు. జూలై 23న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా బ‌య‌ట‌ప‌డ‌టంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసును సస్పెండ్ చేశారు. అత‌నికి స‌హాయం చేసిన హోంగార్డుపై చ‌ర్య‌లు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓరి నాయనో.. 3 గంటలకే నంద్యాలలో 72% పోలింగ్... ఏ పార్టీ అభ్యర్థినో చిత్తుచిత్తుగా(వీడియో)