ఓరి నాయనో.. 3 గంటలకే నంద్యాలలో 72% పోలింగ్... ఏ పార్టీ అభ్యర్థినో చిత్తుచిత్తుగా(వీడియో)
నంద్యాల ప్రజలు ఓటు వేసేందుకు ఉదయానే రెడీ అయిపోయారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటే 6 గంటకే వచ్చేశారు. ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ స్లిప్పులతో నంద్యాల ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ముస్లిం ఓటర్లు ఎక
నంద్యాల ప్రజలు ఓటు వేసేందుకు ఉదయానే రెడీ అయిపోయారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటే 6 గంటకే వచ్చేశారు. ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ స్లిప్పులతో నంద్యాల ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. వృద్ధులు, యువకులే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మొత్తం 2లక్షల 18 వేల 853 మంది ఓటర్లు ఉండగా లక్షా 10 వేల మంది పురుషులు, లక్షా 7 వేల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. 62 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టిడిపి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డితోపాటు వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం 72గా నమోదు కావడం చూస్తుంటే... ఏ పార్టీ అభ్యర్థినో చిత్తుచిత్తుగా ఓటర్లు ఓడించబోతున్నట్లు అర్థమవుతుంది.